జాతీయ స్థాయి కథల పోటీకి ఎంపికైన బండర్‌పల్లి విద్యార్థి
చిన్న చింతకుంట అక్టోబర్ 30: బాలల దినోత్సవాన్ని(Children's Day) పురస్కరించుకుని నిర్వహించిన 'బాలచెలిమి'(Balachelami ) జాతీయ స్థాయి పిల్లల కథల పోటీ-2026(National-Level Children's Story Competition) ఫలితాల్లో చిన్నచింతకుంట మండలం బండర్‌పల్లి గ్రామానికి చెందిన టి. కల్యాణ్ రామ్ రచించిన కథ ఎంపికైంది. గ్రామ నివాసి టి. రాములు కుమారుడైన కల్యాణ్ రామ్ ప్రస్తుతం దేవరకద్రలోని టిజిడబ్ల్యూఎస్ (TGWS) గురుకుల పాఠశాలలో(TGWS Gurukul School) పదవ తరగతి చదువుతున్నాడు.
రెండు తెలుగు రాష్ట్రాలలోని 82 పాఠశాలల నుంచి మొత్తం 252 కథలు పోటీకి రాగా, ప్రముఖ బాలసాహితీవేత్తలు పరిశీలించి 63 ఉత్తమ కథలను ఎంపిక చేశారు. అందులో కల్యాణ్ రామ్ రాసిన ‘అడవికి రాజు ఏనుగు’ కథ ప్రత్యేక గుర్తింపు సాధించి ప్రచురణకు ఎంపికైంది. ఈ కథ త్వరలోనే బాలచెలిమి మాసపత్రికలో ప్రచురితం కానుంది.
జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి తమ గ్రామానికి, పాఠశాలకు పేరు తెచ్చిన కల్యాణ్ రామ్‌ను పలువురు గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు ఘనంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.