వెంకటాపురం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ
వెంకటాపురం నూగూరు అక్టోబర్ 30 విజయ క్రాంతి: వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాధ్ ఐపీఎస్(SP Kakan Sudheer Ramanath, IPS) వెంకటాపురం పోలీస్ స్టేషన్ను సందర్శించి, స్టేషన్ పరిసరాలు, నిర్వహణ, రికార్డులు మరియు పోలీస్ సిబ్బంది పనితీరును సమగ్రంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ముందుగా పోలీస్ స్టేషన్లోని వివిధ రికార్డులను పరిశీలించి, రిసెప్షన్ కౌంటర్, సీసీటీఎన్ఎస్ నమోదు వివరాలు.ఈ-సాక్ష్య అమలు పురోగతిని సమీక్షించారు. కేసులకు సంబంధించిన రికార్డులను నిబంధనల ప్రకారం క్రమబద్ధంగా నిర్వహించాలని, పెండింగ్లో ఉన్న పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిసరాలు, బెల్ అఫ్ అర్మ్స్,కార్యాలయ గదులు, ఇతర ప్రాంగణాలను పరిశీలించిన ఎస్పీ మరింత పరిశుభ్రతను పాటించాలని, రికార్డుల నిర్వహణలో క్రమశిక్షణ, విధుల నిర్వహణలో బాధ్యత, ప్రజలకు అందించే సేవల్లో నిబద్ధత పాటించాలని సిబ్బందికి సూచించారు.ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు, పోలీస్ స్టేషన్ నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యాన్ని నిరంతరం పెంపొందించుకోవాలని ఎస్పీ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.
ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి ఏటూరునాగారం మనన్ భట్ ఐపీఎస్, సి ఐ వెంకటాపురం ముత్యం రమేష్, సి ఆర్ పి ఎఫ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ఎస్ ఐ వెంకటాపురం తిరుపతి,ఎస్ ఐ వాజీడు జక్కుల సతీష్, ఎస్ ఐ పేరూరు అశోక్, ఎస్ ఐ తిరుపతి రెడ్డి, డి సి ఆర్ బి ఏ ఎస్ ఐ శంకరయ్య పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.