ఏడుపాయల చెక్ డ్యాంలో మునిగి వ్యక్తి మృతి

30-10-2026 | 07:27pm

స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి

పాపన్నపేట: ప్రమాదవశాత్తు నీట మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఏడుపాయల ఆలయ సమీపంలోని చెక్ డ్యాంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. పాపన్నపేట గ్రామానికి చెందిన ఆకుల క్రిష్ణ(30) కూలీ పనులు చేస్తూ జీవితం గడుపుతున్నాడు. గురువారం రాత్రి సమయంలో ఏడుపాయల ఆలయం వద్ద ఉన్న తన తల్లి అంజమ్మ వద్దకు వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఏడుపాయల చెక్ డ్యాంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలించగా క్రిష్ణ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు