డిప్యూటీ సిఎంను బర్తరఫ్ చేయాలని సీపీఎం ధర్నా

30-10-2026 | 07:32pm

సామినేని రామారావు హత్య కేసును తప్పుదారి పట్టిస్తున్నారు

భట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దగ్ధం

కూసుమంచి,(విజయక్రాంతి): సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు, చింతకాని మండలం పాతర్లపాడు గ్రామ మాజీ సర్పంచ్ సామినేని రామారావు హత్య విషయంలో అసలు దోషులను పట్టుకోకుండా, పక్కదారి పట్టిస్తున్న  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)  బరఫ్ చేయాలని, డిప్యూటీ సీఎంకు తొత్తుగా మారిన ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని కోరుతూ.. కూసుమంచి మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో భట్టి విక్రమార్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్ మాట్లాడుతూ.. సామినేని రామారావు హత్య జరిగి సంవత్సర కాలం గడిచిన అసలు దోషులను వదిలిపెట్టి  రామారావు హత్యకు సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేశారని, భట్టి విక్రమార్క ను కాపాడేందుకే  పోలీసులు కట్టుకథలు అల్లుతున్నారని, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ బట్టి విక్రమార్క తొత్తుగా మారాలని విమర్శించారు. అసలు నిందితులను కాపాడేందుకు, హత్యకు కారణాలను వెల్లడించకుండా అరెస్ట్ నిందితులను, రామారావును ఎందుకు హత్య చేశారని వివరాలు కూడా చెప్పుకుంటా పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ ముగించారని ఆయన తెలిపారు.

హత్యకు గల ఆధారాలను వెల్లడించకుండా పోలీసులు సరిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టని రామారావును పాతర్లపాడు కాంగ్రెస్ నాయకులే హత్య చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పాలేరు డివిజన్ నాయకులు శీలం గురుమూర్తి,యడవల్లి రమణారెడ్డి, బిక్కసాని గంగాధర్, మండల కమిటీ సభ్యులు చిట్టూరి వెంకన్న, చీర్ల రాధాకృష్ణ, ఎర్రబోయిన సురేష్,, పందిరి వీరారెడ్డి, కందుల బాబు,కర్ణబాబు,ఎస్కే బాబు, తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు