ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
26-09-2026 | 09:28pm
రాజాపూర్ సెప్టెంబర్ 26: మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ilamma) జయంతి వేడుకలను శనివారం గ్రామ పంచాయతీ(Gram Panchayat) ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో(Telangana Armed Struggle) చాకలి ఐలమ్మ పోషించిన వీరోచిత పాత్రను స్మరించుకున్నారు.
భూమి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.మహిళా సాధికారతకు, సామాజిక న్యాయానికి ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రేష్మ నజీమ్ బేగ్, వార్డు సభ్యులు రాచమల్ల యాదగిరి, పంచాయతీ సెక్రటరీలు, రజక సంఘం సభ్యులు, పాల్గొన్నారు.