ప్రతి కుటుంబానికి భరోసా ఇందిరమ్మ ఇల్లు
14-10-2026 | 10:44pm
డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి
మహబూబ్నగర్, (విజయక్రాంతి): నగరంలోని 11వ డివిజన్ బండమీదిపల్లిలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు మహేష్–సుజాత దంపతుల గృహప్రవేశ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి(Deputy Mayor Marepally Surender Reddy) దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గిరి గౌడ్, గోవర్ధన్ గౌడ్, రమేష్ బాబు, మైత్రి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.