బాధ్యతగా పనిచేస్తేనే సముచిత గౌరవం

14-10-2026 | 10:49pm

డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి

మహబూబ్‌నగర్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): వచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ అడుగులు వేస్తేనే సమచిత గౌరవం లభిస్తుందని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం నగరం లోని 31వ డివిజన్ కార్పొరేటర్ రఘు యాదవ్(Corporator Raghu Yadav) ఆధ్వర్యంలో గోకుల యాదవ సంఘం నూతన కార్యవర్గ సభ్యులను డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి శాలువాలతో సన్మానించి అభినందించారు. నూతన అధ్యక్షుడు పార్వతి సుజిత్ యాదవ్, ప్రధాన కార్యదర్శి జోగు గంగన్న యాదవ్, కోశాధికారి పశువుల చంద్రశేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం ఐక్యతతో యాదవుల సంక్షేమం, అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు. సంఘం అభివృద్ధికి తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు, నాయకులు, యాదవ బంధువులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు