పశువుల ఆరోగ్యమే రైతుకు చేయూత

25-11-2026 | 06:06pm

హన్వాడ, నవంబర్ 25: మండలంలోని ఇబ్రహీంబాద్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం(Free Veterinary Camp) నిర్వహించారు. ఈ సందర్భంగా 52 పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్సలు అందించారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ, సంతానోత్పత్తి సమస్యలపై పశుపోషకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదయ్య, డాక్టర్లు విజయలక్ష్మి, నరేందర్ యాదవ్, ఎల్‌ఎస్‌ఏ, వీఏ సిబ్బంది, గ్రామస్థులు, పశుపోషకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు