ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
రాజాపూర్ నవంబర్ 26: భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు(Indian Constitution Day Celebrations) మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ స్వేచ్ఛగా బతుకుతున్నారంటే అది భారత రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశం అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ అధ్యక్షుడు కృష్ణ, నరేష్ సర్పంచులు రామకృష్ణ,సంతోషం వెంకటేష్,డీసీసీ వైస్ చైర్మన్ యాదయ్య, నర్సింలు,యాదగిరి,రమణ, కృష్ణ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.