నిర్మల్ జిల్లాల నషా ముక్త్ భారత్
నిర్మల్ నవంబర్ 26 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో నషాముక్తుభారత్ లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నషాముక్తి భారత్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా(District Collector Bhavesh Mishra) ఆవిష్కరించారు. నిర్మల్ జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ నషా ముక్తి భారత్ పై ప్రజలను చైతన్యం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సత్యనారాయణ , చైర్మన్ గొజ్జ జనార్ధన్, వైస్ చైర్మన్ యం సి లింగన్న,స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు సామనపల్లి రాఘవులు, జిల్లా కమిటీ సభ్యులుఅయ్యన్న గారి భూమయ్య, మంచిరాల నాగభూషణం, నాయుడు రమేష్, ముజాయిద్, మన్సూర్ అహ్మద్, తదితరులు ఉన్నారు