ఘనంగా కాళోజీ నారాయణరావు 24వ వర్ధంతి
గండీడ్,నవంబర్ 13 విజయక్రాంతి : మండల కేంద్రంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు(Kaloji Narayana Rao) 24వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావు(Kaloji Narayana Rao) తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప కవి, రచయిత, ప్రజాకవి అని కొనియాడారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు, సామాజిక సమస్యలను(Social issues) తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారని పేర్కొన్నారు.
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడిగా, అన్యాయం,అక్రమాలు, అసమానతలకు వ్యతిరేకంగా కలాన్ని ఆయుధంగా మలిచిన మహనీయుడిగా గుర్తుచేశారు.ఆయన రచించిన ‘నా గొడవ’ ఎంతో ప్రసిద్ధి చెందిందని, తెలంగాణ భాష,యాస, సంస్కృతి పరిరక్షణకు విశేష కృషి చేశారని తెలిపారు.ఆయన సేవలకు గుర్తింపుగా 2002లో పద్మవిభూషణ్ పురస్కారం లభించిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాగ్యారి భగవంత్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ గిరమోని లక్ష్మీనారాయణ, ఆశన్న, కుందేటి కిష్టయ్య, బోరు కృష్ణయ్య, హస్నాబాద్ వెంకటయ్య, వివేకానంద్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు చిట్లపల్లి మహేందర్, చెన్నారం చెన్నయ్య,జనార్ధన్ గౌడ్, వార్డు సభ్యుడు హస్నాబాద్ చంద్రయ్య, బాలు, బొక్కికిష్టయ్య, అంచన్పల్లి మైబు, కొత్లాబాద్ బంధ్యయ్య, జెట్టి హనుమయ్య, చింత పెద్ద బుగ్గయ్య,కోస్గి శ్రీను, పసుల బాబు,అడివప్ప తదితరులు పాల్గొన్నారు.