పగలు రెక్కీ.. రాత్రికి చోరీ!

25-09-2026 | 05:20am
  1. గ్రామీణ కిరాణా షాపులలో అర్ధ రాత్రి చోరీలు
  2. వరుస ఘటనలతో భయాందోళనలు 
  3. గ్రామాల్లో సీసీ నిఘా అత్యవసరమేనా?
  4. ఆవేదన వ్యక్తం చేస్తున్న చిరు వ్యాపారులు 
  5. పోలీసుల నిఘా పెంచాలంటున్న ప్రజలు

జడ్చర్ల, సెప్టెంబర్ 24: చిరు వ్యాపారమే జీవనోపాధి చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న వారిపై చోరీ చేసే వ్యక్తుల కన్ను పడుతోంది. జడ్చర్ల లో గల్లీలో ఉన్న కిరణా షాపుల(Grocery Shops) నిర్వాణ ఎలా ఉంది అంటూ ముందుగా రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో పక్క ప్రణాళికలతో చోరీలకు పాల్పడుతూ వారి కుటుంబాలను చిన్న భిన్నం చేస్తూ కొందరు వ్యక్తులు చోరీలకు పాల్పడుతున్నారు. గ్రామాల్లో సైతం సీసీ నిఘా ఉంటేనే ఇలాంటి చోరీలను అరికట్టే అవకాశాలు మెండుగా ఉంటాయని పోలీసులు సైతం చెబుతున్నారు. దీంతో ఆ షాపులు ఏర్పాటు చేసుకున్న గ్రామీణ ప్రాంత ప్రజలు ఎప్పుడు చివరికి గురి అవుతుందో అని భయం భయంగా ఉండే పరిస్థితులు నెలకొన్నాయని పలువురు పేర్కొంటుండ్రు. 

వరుసగా చోరీలు...

జడ్చర్ల మండలం(Jadcherla Mandal) కుర్వగడ్డపల్లి గ్రామం లో వరుస చోరీలు గ్రామీణ ప్రాంతాల్లో కలకలం గత కొన్ని నెలలుగా పల్లెల్లో వరుస చోరీలు స్థానిక వ్యాపారులను, ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రధాన రహదారు పక్కన ఉన్న కిరాణా షాపులు, జనరల్ స్టోర్లే లక్ష్యంగా దొంగలు విరుచుకుపడుతున్నారు.

కౌంటర్ నగదు, ఖరీదైన సరుకులే టార్గెట్

షాపుల షట్టర్లు, తాళాలు పగలగొట్టి, రేకులు తొలగించి లోపలికి ప్రవేశిస్తున్నారు. కౌంటర్లలో ఉండే రోజువారీ సీల్ నగదు, సిగరెట్లు, ఖరీదైన నూనె డబ్బాలు, నెయ్యి ప్యాకెట్లు, గుట్కాలు, పాన్ మసాలా బస్తాలను వాహనాల్లో వేసుకుని పరారవుతు న్నారు. ఇటీవల భైరంపల్లి, అల్వాన్ పల్లి, గంగాపూర్, ఏకంగా కుర్వగడ్డపల్లి గ్రామంలో అయితే నెలలు వ్యవధిలో బుధవారం నాడు సంత జరుగు రోజుల్లోనే గత జులై నెలలో (శ్రీను )శ్రీనివాస్ కిరాణం, అదేవిధంగా నిన్న బుధవారం నాడు సంత ముగిసిన తర్వాత (శివాజీ )పరుష వేదిశ్వర కిరాణం రాత్రి వేళల్లో మరొకసారి చోరీకి పాల్పడ్డారు 30 వేల పైన నగదుతో పాటు కిరాణా సరుకులు ఎత్తుకెళ్లారు సంబంధిత ఘటనపై జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.

దీనిపై ఉన్నత అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చోరీకి పాల్పడ్డ వారిని పట్టుకోవాలని గ్రామస్తులు వ్యాపారులు కోరుకుంటున్నారు. సంత జరిగే రోజుల్లో గ్రామాల్లోకి బయటి ప్రాంతాల నుంచి ఎక్కువ మంది రాకపోకలు సాగుతుంటాయని, అదే సమయంలో దుకాణాలు లక్ష్యంగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో పోలీస్ గస్తీ పెంచడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెంచాలని వ్యాపారులు కోరుతున్నారు. 

పర్యవేక్షణ పెంచుతాం 

కుర్వగడ్డపల్లి గ్రామంలో జరిగిన కిరాణా దుకాణాల చోరీ ఘటనలపై ఫిర్యాదు అందింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరణ, చోరీ జరిగిన ప్రాంతాలను పరిశీలించి ఆధారాలను సేకరిస్తున్నాం. వరుస చోరీల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో గస్తీని మరింత పెంచుతాం. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. వ్యాపారులు కూడా తమ దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు రాత్రివేళల్లో నగదు, విలువైన సరుకులను దుకాణాల్లో ఉంచకుండా జాగత్తలు తీసుకోవాలి.

 ఎస్సై జయప్రసాద్ 


మరిన్ని వార్తలు