క్లీన్ షేవ్‌లో సూపర్ స్టార్.. అసలు కారణం ఇదేనా?

25-09-2026 | 03:26pm

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎస్.ఎస్. రాజమౌళి(S.S. Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ కోసం ఇన్నాళ్లూ లాంగ్ హెయిర్, గడ్డంతో కనిపించిన మహేష్.. ఇప్పుడు తన లుక్‌ను పూర్తిగా మార్చేశారు. తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో క్లీన్ షేవ్‌తో కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘వారణాసి(varanasi)’లో తన పాత్రకు తగ్గట్టుగా మహేష్ బాబు ఇంతకాలం ప్రత్యేకమైన హెయిర్, బియర్డ్ లుక్‌ను మెయింటైన్ చేశారు. తాజాగా సినిమాకు సంబంధించిన కీలకమైన చిత్రీకరణ పూర్తవడంతో ఆయన మళ్లీ తన సాధారణ స్టైలిష్ లుక్‌లోకి వచ్చారని తెలుస్తోంది.

చాలా కాలం తర్వాత క్లీన్ షేవ్ అవతార్‌లో కనిపించిన మహేష్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గ్లోబల్ అడ్వెంచర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంక చోప్రా జోనాస్(Priyanka Chopra Jonas), పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం.

ప్రధాన చిత్రీకరణలో ఎక్కువ భాగం పూర్తవడంతో ఇక విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులపై చిత్రబృందం దృష్టి పెట్టనుంది. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రమోషన్ ప్లాన్స్ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక మహేష్ కొత్త లుక్‌పై అభిమానులు సోషల్ మీడియాలో తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఎప్పటిలాగే డ్యాషింగ్‌గా కనిపిస్తున్నాడంటూ కామెంట్లు చేస్తూ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. దీంతో ‘వారణాసి’లో మహేష్ పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి మరోసారి పెరిగింది.

మరిన్ని వార్తలు