రెడ్‌క్రాస్ ద్వారా మరిన్ని సేవలు అందించాలి
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్ (విజయ క్రాంతి) : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ(Indian Red Cross Society) ద్వారా జిల్లా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు(Improved services) అందించాలని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) సూచించారు. జిల్లా శాఖ నూతన చైర్మన్‌గా కేఎస్ రవికుమార్, ఉపాధ్యక్షులుగా రామకృష్ణయ్య, కోశాధికారిగా జి.రమణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యెన్నం శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే వారికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు రెడ్‌క్రాస్ తక్షణ సహాయం అందించాలని అన్నారు. రక్తదాన శిబిరాలు(Blood donation camps), ఉచిత ఆరోగ్య సేవలు(Free health services), ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను(Social service activities) గ్రామీణ స్థాయి వరకు విస్తరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, రెడ్‌క్రాస్ సభ్యులు బాబు చింతలపల్లి, బొండిగ విష్ణు జనార్దన్, చిగుళ్లపల్లి లక్ష్మీనారాయణ, దేవిక బాదిమి, ధర్మరాజు ఎస్., జి.శామ్యూల్, జక్కని తిరుపతి రెడ్డి, మగంతల జయరాములు, పుట్టపాగ రఘుపతి, రవికుమార్ యాదవ్, సురభి జగపతిరావు, వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.