అడ్డాకుల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శరత్ కుమార్ రెడ్డి
యువతను ఏకతాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: శరత్ కుమార్ రెడ్డి
విజయక్రాంతి అడ్డాకుల నవంబర్ 6: దేవరకద్ర నియోజకవర్గ(Devarakadra Constituency) ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి(Madhusudan Reddy) (GMR) ఆదేశాల మేరకు అడ్డాకుల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎం. శరత్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. దేవరకద్ర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్. లక్ష్మీకాంత్ రెడ్డి ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన మండల అధ్యక్షుడు ఎం. శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్. లక్ష్మీకాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
వారి నాయకత్వం, సూచనల మేరకు అడ్డాకుల మండలంలోని ప్రతి గ్రామంలో యువతను ఏకతాటిపైకి తీసుకొచ్చి యూత్ కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. యువత సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడుతూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పనిచేస్తానని స్పష్టం చేశారు.