స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన కౌన్సిలర్ పద్మ
భూత్పూర్, అక్టోబర్ 17 : భూత్పూర్ మున్సిపాలిటీ(Bhoothpur Municipality) పట్టణంలోని అమిస్తాపూర్ గ్రామంలో డీలర్ షాప్(Dealer Shop) దగ్గర స్మార్ట్ రేషన్ కార్డులను(Smart ration cards) కౌన్సిలర్ కేంద్యాల పద్మ(Padma) అర్హులైన వారికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను(welfare schemes) అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డులు ఎంతో ఉపయోగకరమని, వీటి ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేంద్యాల నరేందర్, కో ఆప్షన్ సభ్యులు పవన్, అప్రోజ్, నాయకులు మచ్చేందర్, తిరుపతయ్య, మల్లేష్, గోపాల్, నరసింహ తో పాటు తదితరులు పాల్గొన్నారు.