విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
రాజాపూర్ నవంబర్ 12: విద్యార్థులు ఆరోగ్యం(Student Health) పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని ప్రధానఉపాధ్యాయుడు సయ్యద్ ఇబ్రహీం అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా ఉన్నత పాఠశాలలో(PM Sri District High School) విద్యార్థులకు టీడీ బూస్టర్ టీకాను వేయించారు.
విద్యార్థులకు ఎటువంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం సరఫరా చేసిన టీకాలు వేసినట్లు తెలిపారు. 10-నుండి 16 సంవత్సరంలోపు పదవ తరగతి 56 మంది విద్యార్థులకు ఒక బూస్టర్ TD ఇచ్చారు.విద్యార్థులు ఆటలాడేటప్పుడు గాయాల వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా,బ్యాక్టీరియ, ధనుర్వాతం నుంచి రక్షణ కలిగిస్తుందని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.