7మండలాల్లో సింగిల్ విండో చైర్మన్లు పూర్తి చేస్తా

12-11-2026 | 06:58pm

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్  న‌వంబ‌ర్ 12: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ(Agricultural Market Committee) ఐదో పాలకవర్గం గురువారం కొలువుదీరింది.  నూతన చైర్‌పర్సన్‌గా పసుపుల షమీమ్, వైస్‌ చైర్మన్‌గా పసుపుల నరసింహతో పాటు నూతన పాలకవర్గ సభ్యులు ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి   మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ముఖ్య అతిథిగా హాజరై నూతన చైర్‌పర్సన్, వైస్‌ చైర్మన్, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో  ఘనంగా సన్మానించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గ సభ్యులు పదవులను హోదాగా కాకుండా బాధ్యతగా భావించి, రైతుల సంక్షేమమే ధ్యేయంగా చిత్తశుద్ధితో పనిచేయాలి  అని ఉద్బోధించారు.

కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి, సంక్షేమం కోసం అహ‌ర్నిష‌లు కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు.  నియోజ‌క‌వ‌ర్గం గ‌త రెండున్న‌ర ద‌శాబ్ధాలుగా ఎంతో అభివృద్ధి చెందింద‌ని, కృష్ణా జ‌లాల‌తో ఈ ప్రాంతం ప‌చ్చ‌ని బీల్లుగా మారింద‌ని చెప్పారు. రూ.100 కోట్ల‌తో ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ  నిధుల‌తో కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి ప‌నులు చేప‌ట్టామ‌ని, అంతేకాకుండా  ఆర్ అండ్ బీ, పంచాయ‌తీ రాజ్ శాఖ అద్వ‌ర్యంలో రూ. 400 కోట్లతో ర‌హ‌దారి ప‌నులు ప్రారంభించిన‌ట్లు వెల్ల‌డించారు.

15 రోజుల రోజులో ఏడు మండలాల్లోని సింగల్ విండో చైర్మన్ ల నియమిస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బచ్చలకూర బాలరాజు. మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి. మాజీ జడ్పీటీసీ హనుమత్ నాయక్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డైరెక్టర్లు.సర్పంచులు రైతులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు