కార్మికులకు చట్టప్రకారం వేతనాలు చెల్లించాలి

12-11-2026 | 07:26pm

ఘట్ కేసర్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ కి ఏఐటియుసి నాయకుల వినతి

ఘట్ కేసర్, నవంబర్ 12 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ ప్రభుత్వం ఆస్పత్రిలో(Ghatkesar Government Hospital) పనిచేస్తున్న శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ (Sanitation, Patient Care, Security) కార్మికులకు చట్టప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆస్పత్రి సూపర్డెంట్ కి ఏఐటియుసి రాష్ట్ర నాయకులు కల్లూరి జయచంద్ర, సిపిఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్ కార్మికులతో కలిసి వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న మెడికల్ కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీ నుండి 28 తేదీ వరకు ప్రతిరోజు ఒక గంట సేపు వర్క్ బంద్ చేయాలని వర్క్ అప్పటికి ప్రభుత్వం స్పందించలేక పోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సమయాతం కావాలని కార్మికులకు రాష్ట్ర నాయకత్వం సమ్మెకు పిలుపిచ్చినట్లు తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులకు నెలకు రూ. 26 వేలు వేతనం ఇవ్వాలని, పండుగ జాతీయ అర్జిత సెలవులు అమలుతో పాటు ప్రతి సంవత్సరం బోనస్ చెల్లింపు ప్రతి కార్మికులకు రెండు జతల యూనిఫామ్ 1వ తేదీనే వేతనాలు చెల్లింపు ఇఎస్ఐ, పిఎఫ్ సక్రమంగా కార్మికుల ఖాతాలో జమ చేయాలని ఏఐటియుసి డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి కమిటీ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, బాలమణి, లోదియా, లక్ష్మి, స్వరూప, పుష్ప, లావణ్య, మహేశ్వరి, నాగమ్మ, విజయ, కృష్ణ, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు