క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ

12-11-2026 | 07:22pm

విజయవంతంగా శస్త్రచికిత్స.. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దని సూచన

టాలీవుడ్ హీరోయిన్, బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్(Bigg Boss Telugu Season-4 Contestant Monal Gajjar) ఆరోగ్యంపై కీలక విషయాన్ని వెల్లడించారు. ఇటీవల తాను పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్(Papillary Thyroid Cancer) బారిన పడినట్లు, శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినట్లు తెలిపారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వెల్లడించారు.

కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని మోనాల్ సూచించారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు(Medical tests) చేయించుకోవాలని అభిమానులకు సందేశమిచ్చారు. 'సుడిగాడు', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' వంటి తెలుగు చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన మోనాల్ ఆరోగ్య విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.


https://www.instagram.com/reel/Dfmo6iCglTe/?utm_source=ig_web_button_share_sheet

మరిన్ని వార్తలు