ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
మహమ్మదాబాద్: మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను(Teachers Day celebrations) ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధికారి రాజునాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి, పురస్కారాలు అందజేశారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ రామ్‌లాల్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని, ఉపాధ్యాయులే నవ సమాజ నిర్మాతలని కొనియాడారు.
జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా కే.ప్రభురాథోడ్, వసంతరాణి, ఎం.సదానంద స్వామి, జయసూర్య నారాయణ, ఎం.డి.ఖాదర్, కవిత ఎంపికయ్యారు. మండల స్థాయిలో కే.సరస్వతి, బి.రజిత, ఎ.కుర్మయ్య, ఎస్. మమత, వి.మంజుల, జి.కీర్తి, వనజలత, దీపిక, కే.వాణి, కే.పుష్పలత, ఎన్.లక్ష్మి, ఎం.శ్రీనివాస్, ఎన్.బసమ్మ, ఎం.రామేశ్వరి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై సత్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.డి. సమీర్, నంచర్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎం. సురేందర్ రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.