వచ్చేవారం కేసీఆర్ కీలక భేటీ
బీఆర్‌ఎస్ ముఖ్యనేతలతో సమావేశం
సాగు, తాగునీరు.. విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కీలక చర్చ
రాష్ట్రవ్యాప్త కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్న గులాబీ బాస్
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజాసమస్యలపై మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్(BRS chief KCR) సిద్ధమవుతున్నట్లు తెలు స్తోంది. ఇందులో భాగంగా వచ్చే వారంలో పార్టీకి చెందిన ముఖ్యనేతలతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నట్టు సమాచా రం. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ ప రిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య లు, ప్రభుత్వ విధానాలపై ఈ భేటీలో విస్తృ తంగా చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వ ర్గాలు చెబుతున్నాయి.
ప్రధానంగా సాగునీ రు, తాగునీరు, విద్యుత్, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశాలు సమావేశంలో కీలకంగా ప్రస్తావనకు రానున్నట్లు తెలుస్తోం ది. ఆయా రంగాల్లో ప్రభుత్వం అనుసరిస్తు న్న విధానాలు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదు ర్కొంటున్న ఇబ్బందులు, గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో ప్రస్తు త పరిస్థితులను పోల్చి చూడటంతో పాటు, భవిష్యత్‌లో పార్టీ తరఫున చేపట్టాల్సిన పో రాటంపై కేసీఆర్ నేతలతో చర్చించనున్నట్లు సమాచారం.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం తీరుపై బీఆర్‌ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యలను సభలో ప్రస్తా వించేం దుకు అవకాశం ఇవ్వడం లేదని, ప్ర భుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే అధికారపక్షం నుంచి స్పందన కరువవుతోందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అ సెంబ్లీ బయట కూడా ప్రజా సమస్యలను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని నిలదీయా లని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సాగునీటి అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ముఖ్యంగా పాల మూరున ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టు లకు నిధుల కేటాయింపు, పెండింగ్ పనులు, ఆయకట్టు, రైతులకు అందాల్సిన నీరు వంటి అంశాలను నియోజకవర్గాల వారీగా అధ్య యనం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా తా గునీటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతా లను గుర్తించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
విద్యుత్ సరఫరా పరిస్థితి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశాల ను కూడా బీఆర్‌ఎస్ కీలక రాజకీయ అస్త్రాలుగా మలచుకునే అవకాశం ఉంది. విద్యార్థులు, రైతులు, మహిళలు, యువతతో పాటు వివిధ వర్గాల సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూ పొందించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచ రణపైనే కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించ నున్నట్లు సమాచారం. జిల్లాల వారీగా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించడం, స్థానిక సమస్యలపై కార్యక్రమాలు చేపట్టడం, ప్రభు త్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీయడం వంటి అంశాలపై సమావేశంలో స్పష్టమైన దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థా యిలో పార్టీ శ్రేణులను క్రియాశీలం చేసేలా కార్యాచరణ ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇటీవల అసెంబ్లీ పరిణామాలతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ పోరు మరింత తీవ్రతరమైన నేపథ్యంలో కేసీఆర్ నిర్వహించనున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. పార్టీ భవిష్యత్ వ్యూహం, ప్రజాసమస్యలపై పోరాటం, క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌ను మరింత బలో పేతం చేసే అంశాలపై కీలక నిర్ణయాలు వెలు వడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్య నేతల సమావేశం అనంతరం రాష్ట్రవ్యాప్తం గా చేపట్టే కార్యక్రమాలపై స్పష్టత వచ్చే అవ కాశం ఉంది.