మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం
- పీఓపీ విగ్రహాలతో చెరువులు, కుంటలు, కాలువలకు ముప్పు..
- ఎల్ నినో ఎఫెక్ట్ తో ఎండిన చెరువులు, కుంటలు
- అవగాహన, ప్రకటనలకే పరిమితమవుతున్న పర్యావరణ పరిరక్షణ!
- ఆర్భాటం కాదు బాధ్యత కావాలి!
- సెప్టెంబర్ 14 వినాయక చవితి సందర్బంగా ప్రత్యేక కథనం
నేరేడుచర్ల, సెప్టెంబర్ 11 : మండల కేంద్రాలు(Mandal headquarters), గ్రామాల్లో వినాయక చవితి(Vinayaka Chavithi) సందడి ప్రారంభమయింది. గణేష్ మండపాలు(Ganesh pandals), భారీ విగ్రహాలు(massive idols), విద్యుత్ దీపాలంకరణలు(electric light decorations), ఊరేగింపుల(procession)తో మరో రెండు రోజుల్లో పండుగ వాతావరణం నెలకొననుంది. భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ పం డుగలో ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణ(Environmental Protection)కు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
కానీ ప్రతి ఏడాది పండుగ కు ముందు మట్టి వినాయకుడిని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, పోస్టర్లు వేయడం వరకే అధికారులు పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తు న్నాయి. సంప్రదాయంగా వినాయక విగ్రహాలను మట్టితో తయారు చేసేవారు.మట్టి నీటిలో క్రమంగా కలిసిపోవడంతో పర్యావరణంపై పెద్దగా ప్రభావం ఉండేది కాదు.
కానీ కాలక్రమేణా భారీ పరిమాణంలో పీఓపీ విగ్రహాలు, మెరుపులు అద్దే రసాయన రంగులు, ప్లాస్టిక్ అలంకరణలు పండుగలో భాగమయ్యాయి.
నీటి వనరుల సంరక్షణ అవసరం
ఇప్పటికే అనేక గ్రామాల్లో చెరువులు, కుంటలు, కాలువలు మురుగునీరు, ప్లాస్టిక్ వ్యర్థాల(Plastic waste)తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా యి. అలాంటి నీటి వనరుల్లోనే పెద్ద సం ఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.ఒకవైపు చెరువుల సంరక్షణ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. మరోవైపు పండుగల పేరుతో అదే చెరువుల్లో వ్యర్థాలను వేస్తున్నాం.
ఎల్ నినో ఎఫెక్ట్ తో ఎండిన చెరువులు, కుంటలు
ఇప్పటికే గ్రామాలలో చెరువులు, కుంటలు ఆక్రమణదారుల కబ్జాలకు గురై చాలా వరకు విస్తీర్ణం కోల్పోయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. దీనికి తోడు ఈ సారి ఎల్ నినో ప్రభావము,సరైన వానలు కురవక నీరు లేక చెరువులు,కుంటలు వెలవెలబోతున్నాయి.
ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సంరక్షించుకుందాం.
నీటిలో సులభంగా కరిగిపోయే పర్యావరణహిత మట్టి విగ్రహాలను పూజిద్దాo అనే నినాదంతో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పర్యావరణ పరిరక్షణలో పాటుపడా ల్సిన అవసరం ఉంది.
పర్యావరణ పరిరక్షణలో అందరిదీ బాధ్యత
పర్యావరణ పరిరక్షణ బాధ్యతను పూర్తిగా అధికారులపై నెట్టివేయడం కూడా సరికాదు. గణేష్ మండపాల నిర్వాహకులు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా బాధ్యత తీసుకోవాలి.భారీ విగ్రహం పెట్టడమే భక్తికి కొలమానం కాదు. విగ్రహం ఎంత పెద్దదో కాదు, పండుగ నిర్వహణ ఎంత బాధ్యతగా జరిగిందన్నదే ము ఖ్యం. మట్టి విగ్రహాన్ని ప్రోత్సహించడం, ప్లా స్టిక్‌ను తగ్గించడం, సహజ రంగులను ఉపయోగించడం,నిమజ్జన ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచడం వంటి చిన్న చర్యలే పెద్ద మార్పుకు దారితీస్తాయి.
15 ఏండ్లుగా మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేస్తున్నాము
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వద్దు, మట్టి విగ్రహాలే ముద్దు అనే నినాదంతో లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుల సహకారంతో గత 15 సంవత్సరాలుగా ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం సుమారుగా 200 పైగా మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా ఇస్తున్నాం. ఈ సారి కూడా విగ్రహాలు పంచడానికి సిద్ధంగా ఉన్నాం.
బట్టు మధు, డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ లయన్స్ క్లబ్ నేరేడుచర్ల