జిల్లా స్థాయి నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్

02-11-2026 | 11:43pm

మంచిర్యాల స్పోర్ట్స్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల ఆవరణలోని(ZP Boys' School) జిల్లా సైన్స్ సెంటర్ లో(District Science Centre) సోమ వారం 32వ జిల్లా స్థాయి నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని మొత్తం 87 పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఆయా పాఠశాలల  విద్యార్థులు చక్కటి ప్రతిభతో వినూత్నంగా తమ ప్రదర్శనలను ప్రదర్శించారు.

జిల్లా అడిషనల్ కలెక్టర్, ఇంఛార్జీ జిల్లా విద్యాధికారి పి. చంద్రయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. NCSCలో ఇచ్చిన ప్రతి ఒక్క థీమ్ (theme)పై మాట్లాడారు. నీటిని ఏ విధంగా సంరక్షించాలి, జలవనరుల సంరక్షణ ఏ విధంగా ఉండాలి, వాతావరణంలో జరిగే కాలుష్యాన్ని ఏ విధంగా నివారించాలి, వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహణ కల్పించారు. ఇంట్లో వాడే పదార్థాలను వేరువేరుగా వేరుపరిచి బ్లూ, రెడ్, గ్రీన్ వంటి డస్ట్ బిన్లలో వేసి చెత్త స్వీకరించే వారికి అప్పజెప్పాలని,

హజార్డర్స్ వంటి వ్యర్థాలను వేరుగా డిస్పోస్ చేయాలని సూచించారు. క్వాలిటీ కోఆర్డినేటర్ జె సత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ పట్ల అభిరుచిని కలిగి ఉండి ఇటువంటి సైన్స్ కాంగ్రెస్ లలో వాటి ప్రతిభను కనబరిచి జిల్లాను సైన్స్ లో ఉత్తమమైన ప్రదర్శనలను కనబరిచే జిల్లాగా మార్చాలని ఆకాంక్షించారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లా పలు స్థాయిలలో ఉత్తమంగా ఉందని, సైన్స్ కార్యక్రమాలలో కూడా జిల్లా రాణించాలని, విద్యార్థులందరూ చురుగ్గా పాల్గొన్నాలని కోరారు. 

జిల్లా సైన్స్ అధికారి పి రాజగోపాల్ రావు మాట్లాడుతూ విద్యార్థులు సమస్య పరిష్కారం వైపు ఆలోచించాలని, ఉపాధ్యాయులు విద్యార్థులకు శాస్త్రీయ నైపుణ్యాలు, శాస్త్రీయ ధృక్ పథం అభివృద్ధి జరిగే విధంగా భోదించాలన్నారు. ఉత్తమమైన నాలుగు ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి నామినేట్ చేస్తారని,

ఇవే కాకుండా  సేవ ఫస్ట్ ఇన్నోవేషన్, ఈ వేస్ట్ యేనేజ్మెంట్, తెలంగాణ ఫ్యూచర్ ఇన్నోవేటర్స్  ఛాలెంజ్ లాంటి అనేక సైన్స్ సంబంధిత కార్యక్రమాల్లో సైన్స్ ఉపాధ్యాయులందరూ పాల్గొని విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ నెల చివరి వారంలో జిల్లా స్థాయి ఇన్ స్పైర్, సైన్స్ ఫెయిర్ కార్యక్రమం  నిర్వహించబడుతుందని, అన్ని యాజమాన్యాల పాఠశాలలు పాల్గొనాలని కోరారు. 

NCSCలో ఉత్తమమైన ప్రదర్శనలు...

నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ (NCSC)లో ఉత్తమ స్థానంలో ఐదు ప్రదర్శనలు నిలిచినట్లు నిర్వాహకులు వెల్లడించారు. మొదటి స్థానంలో వేముల వశిష్ఠ (జడ్పీహెచ్ఎస్ జైపూర్), రెండవ స్థానంలో బుర్ర రైష్ణవి (ఆక్స్ ఫర్డ్ నస్పూర్), మూడవ స్థానంలో ముత్యాల అశ్విత (టీజీఎంఎస్ కాసిపేట), నాలుగో స్థానంలో తుమ్మ దీక్షిత (సీబీఎస్ఈ కార్మల్, మంచిర్యాల), ఐదవ స్థానంలో ఏ ప్రియశ్రీ (పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ నీల్వాయి)లు విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయికి ఎన్నికయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణీతలుగా 

అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గంగయ్య (డిపార్ట్మెంట్ ఆఫ్ మాథెమాటిక్స్), అసిస్టెంట్ ప్రొఫెసర్ M.కుమారస్వామి (Department of chemistry), M.నాగ వర్మ ( జూనియర్ lecturer botany), శోభారాణి (senior గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు) లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో NCSC డిస్ట్రిక్ట్ అకాడమిక్ కో ఆర్డినేటర్ (ACADEMIC COORDINATOR) మూర్తి (MURTHY), సీ శ్రీనివాస్ (C.SRINIVAS), సురేందర్ (SURENDER), వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు