విద్యార్థులకు ట్రాఫిక్, సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై అవగాహన
బోధన్, నవంబర్ 02 (విజయ క్రాంతి): నిజామాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ)(Nizamabad Police Commissioner) ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో బోధన్‌లోని విద్యావికాస్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాబృందం సభ్యులు నాటికలు, పాటల రూపంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు.
విద్యార్థులు చిన్న వయస్సు నుంచే రహదారి భద్రతా నియమాలు పాటించాలని, ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ శ్రీనివాస్, బోధన్ ఎస్ఐ హబీబ్, డబ్ల్యూఏఎస్‌ఐ యాదమ్మతో పాటు పోలీస్ సిబ్బంది, కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు.