ఘనంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జన్మదిన వేడుకలు
చెన్నూరు, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) చెన్నూర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్(Balka Suman) జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. శివాలయంలో ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)లో రోగులకు పండ్ల పంపిణీ(Distribution of fruits) చేశారు. అన్నపూర్ణ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు. ఐబీ వద్ద 43 కిలోల కేక్ కట్ చేసి, బాల్క సుమన్ జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకురాళ్లు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.