తెలంగాణ రాష్ట్రంలో బిజెపి గెలుపు తధ్యం
తెలంగాణ రాష్ట్రంలో 2వ స్థానం దక్కించుకున్న సేవా సంకల్ప్ అభియాన్ అంగన్ మిలాన్ ఫోగ్రాం..
జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రికి ఘన సన్మానం..
కొత్తగూడెం టౌన్, (విజయక్రాంతి): నరేంద్ర మోడీ ప్రజాప్రతినిధిగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, జాతీయ, రాష్ట్ర బిజెపి పిలుపుమేరకు "సేవా సంకల్ప్ అభియాన్" లో భాగంగా చేపట్టిన "అంగన్ మీలాన్" కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) రెండవ స్థానంలో నిలవడంపై జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర బిజెపి కార్యాలయానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు, చత్తీస్గడ్ రాష్ట్ర, మహాసముంద్ ఎంపీ శ్రీమతి రూప్ కుమారి చౌదరి చేతుల మీదుగా ఘన సన్మానం అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గాయత్రి మాట్లాడుతూ.. సమర్థవంతమైన నాయకుడు, ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, ప్రధానమంత్రిగా 12సంవత్సరాలు సుదీర్ఘకాలం పాటు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంతోషకరమైన సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ అధిష్టానం "సేవా సంకల్ప్ అభియాన్" పేరిట 9 రకాల సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా బిజెపి మహిళా మోర్చాకు కేటాయించిన "అంగన్ మీలాన్" కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా మోర్చా కార్యకర్తలు, నాయకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రస్థాయిలోనే ద్వితీయ (2వ) స్థానంలో నిలవడం ఎంతో గర్వకారణమని జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు పేర్కొన్నారు. ఈ అద్భుత ప్రతిభకు గుర్తింపుగా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం మహాసముంద్ లోక్సభ సభ్యురాలు, బిజెపి జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి రూప్ కుమారి చౌదరి చేతుల మీదుగా టాప్-5లో నిలిచిన జిల్లా అధ్యక్షురాళ్లతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలునైనా నన్ను సన్మానించిన జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలికి అలాగే రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.
"గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అందించిన సుపరిపాలన, ప్రజాసేవ మనందరికీ స్ఫూర్తిదాయకం. బిజెపి మహిళా మోర్చా జాతీయ, రాష్ట్ర నాయకత్వాల పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని, చిన్నారులను, గర్భిణులను కలిసి మోడీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించాం. జిల్లాలోని ప్రతి గ్రామంలో మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు రాత్రింబవళ్లు శ్రమించి 'అంగన్ మీలాన్' కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మన జిల్లాను రాష్ట్రస్థాయిలో 2వ స్థానంలో నిలిపినందుకు జిల్లాలోని మహిళా మోర్చా నాయకురాళ్లకు, కార్యకర్తలకు, బిజెపి జిల్లా నాయకత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర స్థాయిలో జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎంపీ శ్రీమతి రూప్ కుమారి చౌదరి గారి చేతుల మీదుగా సన్మానం అందుకోవడం నా ఒక్కదానికే కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి మహిళా మోర్చా కార్యకర్తలందరికీ లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా మోడీ గారి సంక్షేమ ఫలాలను ఇంటింటికీ తీసుకెళ్లడానికి మహిళా మోర్చా నిరంతరం కృషి చేస్తుంది అని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.