గంజాయి పట్టివేత.. ఒకరు అరెస్టు

07-09-2026 | 11:39pm

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి(Bellampalli)లో అక్రమంగా గంజాయి(Cannabis) రవాణా చేస్తున్న ఒకరిని అరెస్టు చేసి 200 గ్రాముల గంజాయినీ పట్టుకున్నారు. బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ హెచ్ వో కె. శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో నీ కన్నాల రహదారి ప్రధాన కూడలి హనుమాన్ విగ్రహం వద్ద ఆదివారం రాత్రి ఎస్ఐ  డి. రామకృష్ణ,సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తున్నారు. Honda SP125 మోటార్ సైకిల్ పై వెళ్తోన్న వ్యక్తిని ఆపి తనిఖీ చేయగా, అక్రమంగా 200 గ్రాముల గంజాయితో పట్టుబడ్డాడు. నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించగా సదరు వ్యక్తి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komuram Bheem Asifabad District) బెజ్జూరు మండలం సాలుగుపల్లి గ్రామానికి చెందిన గోమాసు ప్రకాష్ గా గుర్తించారు.

నిందితుడు మంచిర్యాలలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ, గత 3 నెలలుగా గంజాయికి అలవాటు పడి,  డబ్బుకోసం తక్కువ ధరకు మహారాష్ట్ర బల్లార్షా రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నాడు.గంజాయిని  ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు విచారణలో తెలిపాడు.  05న మంచిర్యాల నుండి తన Honda SP125 B.No: TG19 4074 పై బయలుదేరి బెల్లంపల్లి రైల్వే స్టేషన్ వద్ద బైక్ పార్క్ చేసి, రైలులో బల్లార్షా కు వెళ్లి  200 గ్రాముల గంజాయిని రూ.5000/- లకు కొనుగోలు చేసి, తిరిగి బెల్లంపల్లికి వచ్చాడు. బజార్ ఏరియా నుండి తన గ్రామానికి వెళ్తూ బెజ్జూర్ పరిధిలో అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డాడు. నిందితుడిని నుంచి రూ. 10వేల విలువైన 200 గ్రాముల గంజాయి, నలుపు & ఎరుపు రంగు Honda SP125 బైక్.(B.No: TS19 4074),  POCO X3 - Dark Gray మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితున్ని కోర్టు లో హాజరు పరిచినట్టు ఎస్ హెచ్ వో శ్రీనివాసరావు వెల్లడించారు.

మరిన్ని వార్తలు