రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన సీఓఈ విద్యార్థి వినయ్
26-09-2026 | 09:43pm
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(Telangana Social Welfare Gurukul School) సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్సీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న బండారి వినయ్ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ సీనియర్స్ ఎంపిక అవ్వటం పట్ల ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ హర్షం తెలిపారు. మంచిర్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాంబశివమూర్తి మారయ్య జెఎన్ఎస్ స్టేడియంలో ఈ పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ... రాష్ట్ర స్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ తన్నీరు గోపి, హౌస్ మాస్టర్ ఎన్ ఎస్ వర్మ, కమలాకర్, అభినందించారు.