హెల్మెట్లు ధరించిన వారిని అభినందించిన పోలీసులు

22-11-2026 | 06:46pm

మంచిర్యాల క్రైమ్, నవంబర్ 22 : మంచిర్యాల పట్టణంలోని(Mancherial town) బెల్లంపల్లి చౌరస్తాలో వద్ద స్కూటీపై హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న ప్రయాణిస్తున్న వారిని మంచిర్యాల పోలీసులు(Mancherial Police) ఆది వారం అభినందించారు. హెల్మెట్ ధరించడంలో(Wearing a helmet) వింత ఏముంది అనుకుంటున్నారా... వాహనంపై కూతురుతో ప్రయాణిస్తున్న ఆ దంపతులు ముగ్గురికి ముగ్గురు హెల్మెట్లు ధరించి ప్రయాణించడం అభినందనీయం. ముగ్గురూ హెల్మెట్లు ధరించి వెళ్లడం గమనించిన ట్రాఫిక్ ఎస్‌ఐ రాములు(Traffic SI Ramulu) వారిని ఆపి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రాములు మాట్లాడుతూ భద్రత కోసం హెల్మెట్ బాధ్యతాయుత ప్రయాణానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జగన్, కానిస్టేబుల్ ప్రదీప్ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు