పేదరికాన్ని జయించి హైకోర్టు న్యాయవాదిగా రవితేజ
తాడ్వాయి,నవంబర్,22( విజయక్రాంతి): పేదరికం చదువుకు అడ్డంకి కాదని,కష్టపడే తత్వం పట్టుదల స్పష్టమైన లక్ష్యం ఉంటే ఎన్ని ఇబ్బందులనైనా అధిగమించి ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని విద్యార్థి నాయకుడు భూంపల్లి రవితేజ(Student leader Bhoompalli Raviteja) నిరూపించారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన భూంపల్లి రవితేజ(Bhoompalli Raviteja) చిన్ననాటి నుంచి పేదరికంతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ చదువు కొనసాగించాడు. ఆయన ఎలాగైనా మంచి స్థాయికి చేరుకోవాలనే పట్టుదలతో ముందుకు వెళ్లారు.
ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగారు. విద్యార్థి నాయకుడిగా, భారతీయ విద్యార్థి మోర్చా(Indian Student Front) రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్రంలోని విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై నిరంతరం పోరాటం చేస్తూ తన కృషిని కొనసాగిస్తున్నారు.రవితేజ ఉద్యమ నాయకుడిగా ఉంటూ న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఆయన హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో(Osmania University) ఎల్.ఎల్.బి(LLB) పూర్తి చేసి న్యాయవాది పట్టాను(Law Degree) అందుకున్నారు. ప్రస్తుతం హైకోర్టులో(High Court) న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నారు.
రవితేజ న్యాయవాదిగా హైకోర్టులో బాధ్యతలు ప్రారంభించడంపై కుటుంబ సభ్యులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ..... ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువులు మధ్యలో ఆపకూడదని తెలిపారు.విద్య ప్రతి ఒక్కరి హక్కు అని పేర్కొన్నారు.పేదరికంలో ఉన్న పట్టుదల,నిరంతర శ్రమ ఉంటే ఎవరైనా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆయన తెలిపారు.న్యాయవాదిగా తాను పేదలకు న్యాయం చేస్తానని తెలిపారు.