బిపిఎం ఆత్మహత్య
14-10-2026 | 10:34pm
భీమిని,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) భీమిని మండలం కర్జీబింపూర్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న గజానంద్ (23) ఉరి వేసుకొని ఆత్మహత్య(Suicide) చేసుకున్న సంఘటన బుధవారం వెలుగు చూసింది. భీమిని ఎస్ఐ కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం బీపీఎంగా విధులు నిర్వహిస్తూ పోస్ట్ ఆఫీస్ డబ్బులను జల్సాల కోసం వాడుకొని అవి కట్టలేని పరిస్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. గజానంద్ తండ్రి సాహేబ్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గజానంద్ కు భార్య సంజీవని ఉంది.