విద్యార్థులకు విజ్ఞాన విహారం

21-11-2026 | 12:47am

డ్రాగన్ ఫ్రూట్ సాగు, ఎఫ్‌ఎం రేడియో, పవర్‌లూమ్ యూనిట్ సందర్శన

మంచిర్యాల, ( విజయక్రాంతి ): మంచిర్యాల పట్టణంలోని(Mancherial town) స్మార్ట్‌కిడ్స్ పాఠశాల(Smartkids School) విద్యార్థులు నేడు విద్యా విజ్ఞాన యాత్రలో భాగంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు క్షేత్రం(dragon fruit farm), ఎఫ్‌ఎం రేడియో స్టేషన్, పవర్‌లూమ్ యూనిట్‌లను సందర్శించారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో సాగిన ఈ పర్యటనలో విద్యార్థులు డ్రాగన్ ఫ్రూట్ ఆధునిక సాగు పద్ధతులు, బిందు సేద్యం గురించి తెలుసుకున్నారు. అనంతరం ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌ను సందర్శించి ప్రత్యక్ష ప్రసార విధానాన్ని పరిశీలించారు.

పవర్‌లూమ్ యూనిట్‌లో వస్త్రాల తయారీ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించి అవగాహన పొందారు. పాఠ్యాంశాలకు క్షేత్రస్థాయి అనుభవాన్ని జోడించడం ద్వారా విద్యార్థుల్లో ఆచరణాత్మక పరిజ్ఞానం, నైపుణ్యాలు పెంపొందుతాయని పాఠశాల ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఈ పర్యటనకు సహకరించిన మూడు సంస్థల నిర్వాహకులకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

మరిన్ని వార్తలు