డెలివరీ బ్యాగ్‌ మాటున గంజాయి దందా

21-11-2026 | 12:53am

స్విగ్గీ బాయ్‌ అరెస్ట్‌!

శేరిలింగంపల్లి,నవంబర్ 20(విజయక్రాంతి): మాదాపూర్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్‌గా(Swiggy delivery boy) పనిచేస్తూ గంజాయి విక్రయాలకు(selling ganja) పాల్పడుతున్న ఒడిశాకు చెందిన బలరాం మొహంతా(Balaram Mohanta) (28)ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్(Madhapur police arrested) చేశారు. సిద్దిక్‌నగర్‌లోని రోడ్ నంబర్‌ 4లో పోలీసులు, డివిజన్ క్లోజ్ టీమ్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో నిందితుడు పట్టుబడ్డాడు. ఒడిశాకు చెందిన బాబు అనే వ్యక్తి వద్ద కిలో గంజాయిని రూ.15 వేలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చిన బలరాం, దానిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి ఒక్కో ప్యాకెట్‌ను రూ.400 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

నిందితుడి వద్ద, అతని నివాస గదిలో కలిపి మొత్తం 1,089 గ్రాముల గంజాయితో పాటు ఎలక్ట్రానిక్ తూకం యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి సరఫరా చేస్తున్న ఒడిశాకు చెందిన బాబు పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు