రైస్ మిల్లర్లకు సుప్రీం షాక్

20-11-2026 | 06:08pm

హైదరాబాద్: తెలంగాణలో డిఫాల్ట్ రైస్ మిల్లర్ల(Default Rice Millers)కు సంబంధించిన కేసుల వ్యవహారం సుప్రీంకోర్టు(Supreme Court)లో కీలక మలుపు తిరిగింది. మిల్లర్లపై ఎఫ్‌ఐఆర్ల నమోదును అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను మిల్లర్ల తరఫు న్యాయవాదులు ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ వ్యవహారంలో మిల్లర్లకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సిన ధాన్యం విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా డిఫాల్ట్ మిల్లర్లకు సంబంధించి ఇప్పటికే 540 ఎఫ్‌ఐఆర్లు నమోదయ్యాయి. లక్షల మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టిందనే ఆరోపణలు ఈ వ్యవహారాన్ని మరింత తీవ్రతరం చేశాయి.

ఎఫ్‌ఐఆర్ల నమోదును నిలువరించేందుకు మిల్లర్ల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ, తాజాగా పిటిషన్ల ఉపసంహరణతో దర్యాప్తు, తదుపరి న్యాయపరమైన చర్యలపై ఆసక్తి నెలకొంది. డిఫాల్ట్ మిల్లర్ల వ్యవహారంలో ఇకపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు