అనాథ విద్యార్థికి ఎన్ఆర్ఐ చేయూత
- ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ కోర్సుకు ఫీజు చెల్లింపు
ఎల్బీనగర్, నవంబర్ 20 : అనాథ విద్యార్థి(Orphan student) ఉన్నత చదువుకు ఎన్ఆర్ఐ(NRI) చేయూతనిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహంలో(Orphan Students Home) ఉంటున్న హనుము మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజి(Government Medical College)లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. విద్యార్థి విద్యార్థి విషయాన్ని సరూర్ నగర్ లోని ఎస్వీ కాలనీ నివాసి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న చింతల రజినీకాంత్ తెలుసుకున్నారు. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ కోర్సు ఫీజు రూ.26 వేలను గురువారం అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్ కు పంపించారు.
ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ... నాన్న చనిపోయి, అనాథ విద్యార్థి గృహంలో చదువుకుంటూ ఎంబీబీఎస్ సీటు సాధించిన రమావత్ హనుము డాక్టర్ చదువుకు నాలుగు సంవత్సరాల నుంచి అన్ని రకాల ఫీజులు, అవసరమైన బుక్స్, స్టేషనరీ, మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ప్రిపేర్ కు అవసరమైన రూ.36 వేల ఐపాడ్ ను అందజేశారని తెలిపారు.
హనుము ఎంబీబీఎస్ పూర్తి కోర్సు చదువుకోడానికి అన్ని రకాల సహాయం అందిస్తున్న రజినీకాంత్ కు గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో రజనీకాంత్ మిత్రులు, యూనియన్ బ్యాంక్ దిల్ సుఖ్ నగర్ బ్రాంచ్ మేనేజర్ కంభంపాటి సతీశ్ పాల్గొన్నారు.