దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలి
వనస్థలిపురంలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
ఎల్బీనగర్, నవంబర్ 20 : నల్గొండ జిల్లా(Nalgonda District) కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికురాలిపై(Sanitation worker (female)) దాడి చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని వనస్థలిపురం డివిజన్ శ్రీవెంకటరమణ కాలనీ చౌరస్తాలో మల్కాజిగిరి మున్సిపల్(Malkajgiri Municipal) పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఎంప్లాయిస్ యూనియన్(GHMC Employees Union) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆలేటి ఎల్లయ్య, కార్యదర్శి పారానంది శ్రీనివాసులు మాట్లాడారు.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో 45 వ డివిజన్ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న దళిత మహిళ చందుపట్ల రమణ (45)పై దాడి చేసిన బాలకృష్ణ అనే వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధితురాలికి తగిన న్యాయం చేయడంతో పాటు, ఆమెకు మెరుగైన వైద్యం, భద్రత కల్పించాలని కోరారు.
కార్యక్రమంలో కార్మికులు ఎల్లమ్మ, అరుణ, సుగుణమ్మ, ధనమ్మ, సీతమ్మ, రమేష్, శ్రీను,మహేష్, బుచ్చమ్మ, అంజమ్మ, లక్ష్మీదేవి, రమణమ్మ, పకీరమ్మ, తదితరులు పాల్గొన్నారు.