కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ ఆర్థిక సాయం

25-11-2026 | 12:51pm

వెంకటాపురం, నవంబర్ 25 (విజయక్రాంతి): ప్రతి కార్యకర్త కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని బీఆర్ఎస్ నాయకులు భరోసా ఇచ్చారు. వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బట్ట నాగేంద్రబాబు ఇటీవల మృతి చెందారు. ఆయన దశదిన కర్మ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గుడవర్తి నర్సింహమూర్తి ఆదేశాల మేరకు రూ.5 వేల ఆర్థిక సహాయం (Financial Assistance) అందజేశారు.

నాగేంద్రబాబుకు భార్యతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. నాగేంద్రబాబు మృతి పార్టీకి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మంచర్ల నాగేశ్వరరావు, బట్ట నాగేందర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, గ్రామ సర్పంచ్ షోలం హోంపతి, బట్ట నారాయణ, మంచర్ల సాంబం, గగ్గురి రమేష్, దర్రాజు కృష్ణమూర్తి, పుణ్యం శ్రీనివాస్, మునిగేల సోమరాజు, ఎక్కిబోయిన సాయికిరణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు