ఆదిలాబాద్ కాంగ్రెస్ బలోపేతంపై సందీప్ దిశానిర్దేశం
ఆదిలాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): జిల్లాలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) పటిష్టతకు ప్రత్యేక కృషి చేయాలని పార్టీ శ్రేణులకు రాష్ట్ర ఇంచార్జీ బి.ఎం. సందీప్ సూచించారు. నూతన ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన బి.ఎం. సందీప్‌తో పాటు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌ను డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.
అనంతరం జిల్లా కాంగ్రెస్ కార్యాలయ నిర్మాణం, పార్టీ బలోపేతం (Party Strengthening) తదితర అంశాలపై నాయకులతో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, పార్టీ లీగల్ సెల్ చైర్మన్ మంగేష్ దేవతాడే, జిల్లా కార్యాలయ ఇన్‌చార్జి సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.