అక్రమ ఇసుక నిల్వలపై రెవెన్యూ అధికారుల కొరడా
* నాగ్సాన్‌పల్లి శివారులో ఇసుక నిల్వలు సీజ్
* అనుమతులు లేకుండా ఇసుక తవ్వితే కఠిన చర్యలు తప్పవు: ఆర్‌ఐ శరత్
పాపన్నపేట, అక్టోబర్26: మండల పరిధిలోని నాగ్సాన్‌పల్లి గ్రామ శివారులో మంజీరా నది(Manjeera River) నుంచి అక్రమంగా ఇసుక తవ్వి నిల్వ చేసిన ఇసుకను రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం గ్రామ శివారులో తనిఖీలు నిర్వహించిన పాపన్నపేట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) శరత్ అక్రమ ఇసుక నిల్వలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టడం, ఇసుకను అక్రమంగా నిల్వ చేయడం చట్టరీత్యా నేరమని ఆర్‌ఐ పేర్కొన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.