ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

23-11-2026 | 07:45pm

పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం

వెల్దుర్తి, నవంబర్ 23 (విజయక్రాంతి): పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమాన్ని వెల్దుర్తి(Veldurthi ) మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు పథకం ఉద్దేశాలు, ప్రయోజనాలపై వివరించారు. అర్హులైన కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పించేందుకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దండెం ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రావణ్ కుమార్, వార్డు సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు