భూమి ఉన్నా లేకున్నా కుటుంబ బీమా పథకం అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే

23-11-2026 | 07:41pm

బోథ్ నవంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కుటుంబ జీవిత బీమా పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ సోనాల మండల ఉపాధ్యక్షులు షేక్ మహబూబ్(Congress leader Sheikh Mahboob) మాజీ కోఆప్షన్ నెంబర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పేదలకు ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఐదు లక్షల బీమా సహాయమందిస్తుందన్నారు. భీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. 18 నుండి 59 ఏళ్లలో వయస్సు ఉన్న వారికి ఈ భీమ వర్తిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి 15 వేల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది అన్నారు. ఏది ఏమైనా తిరంగాలా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు