క్రీడల్లో రాణిస్తే వ్యక్తిగత గుర్తింపు లభిస్తుంది
ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి , సిఐ రంజిత్ రావు
సుల్తానాబాద్, నవంబర్ 23 (విజయ క్రాంతి): క్రీడారంగంలో(Sports fields) రాణిస్తే వ్యక్తిగతంగా గుర్తింపు లభిస్తుందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల(Alfors Educational Institutions) అధినేత నరేందర్ రెడ్డి, సిఐ రంజిత్ రావు లు అన్నారు , సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో విద్యార్థులకు కోకో, కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు .
పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అధినేత నరేందర్ రెడ్డి, సిఐ రంజిత్ రావు లు మాట్లాడుతూచదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యతని ఇవ్వాలని క్రీడలు కేవలం వినోదం కోసమే కాకుండా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని, క్రీడలతో నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే నైపుణ్యాలు అభివృద్ధి చేస్తాయన్నారు, క్రీడల్లో గెలుపోవటములను సమానంగాతీసుకోవాలన్నారు. ముందుగావిద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అతిథులు క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్సై చంద్రకుమార్ , సీనియర్ క్రీడాకారుడు గాజుల రాజమల్లు తో పాటు ప్రిన్సిపాల్ అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.