రూ.154 కోట్లతో జనగామ మెడికల్ కాలేజీ ప్రారంభానికి సిద్ధం

23-11-2026 | 07:28pm

ఈ నెల 27న ప్రారంభోత్సవం

జనగామ, నవంబర్ 23 (విజయక్రాంతి): జనగామ మెడికల్ కాలేజీ(Jangaon Medical College) భవనం, క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు వేగవంతం చేయాలని మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సోమవారం సచివాలయంలో వైద్య సేవలపై సమీక్ష నిర్వహించిన మంత్రులు, రూ.154 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణ పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.

ఈ నెల 27న ప్రారంభోత్సవం నిర్వహించేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్. చొంగ్తు, కమిషనర్ ముషారఫ్ అలీ ఫరూఖీ, డీఎంఈ వాణి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ నాగమణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు