బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్‌కు ఘన సన్మానం..
బాన్సువాడ, నవంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి చౌరస్తా పరిధిలోని వివిధ గ్రామాల ప్రజల ప్రయాణ ఇబ్బందులను పరిష్కరించే దిశగా కీలక ముందడుగు పడింది. దుర్కి చౌరస్తా వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులను నిలిపివేయాలన్న ప్రజల విజ్ఞప్తికి స్పందించిన బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్(RTC Depot Manager Ravikumar) మూడు ఎక్స్‌ప్రెస్ బస్సులను నిలిపేందుకు అంగీకరించారు.
ఈ సమస్య పరిష్కారం కోసం రూరల్ సీఐ తిరుపతయ్య చొరవ తీసుకున్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులను సీఐ కార్యాలయానికి పిలిపించి, ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్‌తో చర్చలు జరిపించారు. ప్రయాణికుల ఇబ్బందులను సంఘం నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన డిపో మేనేజర్ దుర్కి చౌరస్తా జంక్షన్ వద్ద నిజామాబాద్, బోధన్ వైపు వెళ్లే మూడు ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం నిలిపేందుకు అంగీకరించారు.
దీంతో సమస్య పరిష్కారానికి చొరవ చూపిన రూరల్ సీఐ తిరుపతయ్య, డిపో మేనేజర్ రవికుమార్‌లను బాన్సువాడ డివిజన్ అంబేద్కర్ సంఘం నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు బంగారం మైసయ్య, ఎన్. నర్సింలు, దేశాయిపేట ప్రశాంత్ కుమార్, మన్నె చిన్న సాయిలు, కోరే బాలయ్య, దుర్కి గ్రామ సర్పంచ్ నారా గౌడ్, బస్వాయిపల్లి సర్పంచ్ షేక్ ఖాజా, దుర్కి ఉపసర్పంచ్ ఫెరోజ్, రాంపూర్ నాయకులు మోహన్ రెడ్డి, కుర్మ గణేష్ తదితరులు పాల్గొన్నారు.