మహిళా భవనం నిర్మాణ పనుల్లో అక్రమాల ఆరోపణలు!

23-11-2026 | 07:32pm

రాంపూర్ సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో ఫిర్యాదు

చేర్యాల, నవంబర్ 23: చేర్యాల మండలంలోని రాంపూర్ గ్రామంలో(Rampur village) మహిళా భవనం(Women's building), సీసీ రోడ్ల పనుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన గణేష్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా భవనం పనులను సర్పంచ్ శెట్టి కొమురయ్య స్వయంగా కాంట్రాక్టు తీసుకుని, పంచాయతీ ట్రాక్టర్, సిబ్బందిని వ్యక్తిగత పనులకు వాడుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంచినీటి ట్యాంకర్ బిల్లులు చెల్లించకుండా వాడుకున్నారని, సీసీ రోడ్లలో నాణ్యత పాటించలేదని ఆరోపించారు.ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో ప్రణయ్ కు వినతిపత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు