బతుకమ్మ వేడుకల్లో బాలికలను సన్మానం చేసిన సర్పంచ్
చేగుంట అక్టోబర్ 09, (విజయక్రాంతి) : అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని(International Day of the Girl Child) పురస్కరించుకొని చేగుంట మండలం(Chegunta Mandal) పొలంపల్లి గ్రామంలో సర్పంచ్ కోండి రాజ్యలక్ష్మి(Kondi Rajyalakshmi) స్వామి ఆధ్వర్యంలో గ్రామం లోని ప్రతిభావంతులైన బాలికలకు సన్మానం నిర్వహించారు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామ మహిళలు, అక్కాచెల్లెళ్లు బతుకమ్మ సంబరాల సందర్భంగా పలు జాగ్రత్త పాటించాలని, తెలంగాణ సాంస్కృతి(Telangana Culture) రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ పాలక వర్గం తరుపున భద్రత చర్యలు చేపడతామని తెలిపారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు చౌడం స్వప్న నర్సింలు, యాట మౌనిక బాలకృష్ణ, గరిగే మంజుల గిరి, కొండి కలమ్మ మల్లేష్ సభ్యులతో కలిసి బాలికలకు సన్మానించడం జరిగింది.