ఘనంగా ప్రారంభమైన ‘ఎంగిలిపూల బతుకమ్మ’!

10-10-2026 | 08:47pm

వెంకటాపురం నూగూరు అక్టోబర్ విజయ్ క్రాంతి : తెలంగాణ సంస్కృతికి(Telangana Culture), ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు(Bathukamma Festival Celebrations) వెంకటాపురంలో ఘనంగా శనివారం ప్రారంభమయ్యాయి.  ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు ఔషధ గుణాలున్న తంగేడు, గునుగు, బంతి తీరొక రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను కొలుస్తారు. 

లైవ్ టీవీ బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి అని అర్థమని, ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు పండాలని, కుటుంబం సంతోషంగా ఉండాలని, యువతులు మంచి భర్త రావాలని కోరుతూ తోమిది రోజుల పాటు ఈపూల పండుగను తెలంగాణ ఆడబిడ్డలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని మహిళలు తెలిపారు. ఈకార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు