విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి

10-10-2026 | 08:45pm

మహమ్మదాబాద్,(విజయక్రాంతి):  మండలంలోని రైతులకు వ్యవసాయ విద్యుత్‌(Agricultural Electricity)ను నిర్ణీత సమయానికి సరఫరా చేయడంతో పాటు, నాణ్యమైన విద్యుత్ అందించాలని బీజేపీ మండల అధ్యక్షుడు మూస నరసింహ డిమాండ్ చేశారు. వోల్టేజ్ హెచ్చుతగ్గులు, తరచూ విద్యుత్ అంతరాయాల వల్ల వ్యవసాయ(Agricultural) మోటార్లు, స్టార్టర్లు కాలిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, కాలిపోయిన మోటార్ల సమస్యలపై తగిన న్యాయం చేయాలని కోరారు. రైతుల(Farmers) సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కుర్వకృష్ణ తిరుపతిరెడ్డి శ్రీనివాసులు తదితర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు