మాజీ సర్పంచ్ కిష్టయ్య మృతి తీరని లోటు..

16-10-2026 | 03:19pm
  1. పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
  2. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి

పాపన్నపేట,అక్టోబర్16: మండల పరిధిలోని నార్సింగ్‌ గ్రామ మాజీ సర్పంచ్‌, బీఆర్ఎస్ పార్టీ నాయకులు(BRS party leaders) నీలగిరి కిష్టయ్య మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆయన మృతి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి(Former MLA M. Padma Devender Reddy) పేర్కొన్నారు. కిష్టయ్య మృతి విషయం తెలుసుకొని శుక్రవారం నార్సింగ్‌ గ్రామానికి చేరుకుని ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించి, కిష్టయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు జగన్‌, సర్పంచ్‌ లు మల్లేశం, సాయిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు కుబేరుడు, నాయకులు సోములు, దుర్గయ్య, బాబాగౌడ్‌, గోపాల్, అనిల్‌రెడ్డి, బద్రి మల్లేశం, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, వెంకట్ రాములు, రవీందర్ నాయక్, సామెల్, నర్సింలు, మహిపాల్ రెడ్డి, తదితరులున్నారు.

మరిన్ని వార్తలు